
ఈ నెల 31న విడుదలకావాల్సిన ‘బాహుబలి’ ఆడియో లాంచ్ వాయిదాపడడంతో ఫోకస్ అంతా మహేష్ – కొరటాల శివ సినిమాపై పడింది. అదే తారీఖున ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలచేయనున్న సంగతి తెలిసినదే.
ఈ రెండిటిలో ఏ వీడియో ప్రేక్షకులను అలరిస్తుందీ అంటూ గతకొన్ని రోజులుగా మీడియాలో లెక్కలేనంత చర్చలు జరుగుతూ వస్తున్నాయి. రాజమౌళి ట్రైలర్ కి యూనివర్సల్ అప్పీల్ వున్నా మహేష్ క్రేజ్ కూడా దాదాపు దానికి సమానమే.
ఇప్పుడు ఈ ఆడియో లాంచ్ వాయిదాపడడంతో మహేష్ కు ఆ తారీఖు పూర్తిగా అనుకూలంగా మారిపోయింది. శృతిహాసన్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తుంది. జులైలో ఈ చిత్రాన్ని విడుదలచేసి మహేష్ అభిమానులకు కనువిందు కలిగిస్తామని చిత్రబృందం తెలుపుతుంది.