
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లయన్’. బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమాలో లానే ఇందులో కూడా ద్విపాత్రాభినయం చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్దమయ్యాడు. నిన్ననే ఈ సినిమా రిలీజ్ కోసం డిసైడ్ చేసిన ఓ ప్రత్యేక ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసారు. లయన్ సినిమాని మే 8వ తేదీన 10 గంటల 4 నిమిషాలకు రిలీజ్ చెయ్యాలని ప్రొడక్షన్ టీం ప్లాన్ చేసింది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది.
ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ని రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ చాలా స్పెషల్ గా ఉండేలా డిజైన్ చేసారు. ఇప్పటికే ఈ సినిమాలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చూసిన వారు సూపర్బ్ గా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా రంపచోడవరం ఫారెస్ట్ లో వర్షంలో తీసిన ఓ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి పెద్ద హైలైట్ అవుతుందని ఈ ప్రొడక్షన్ టీం అంటోంది. సత్యదేవ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత.