4 టైటిల్స్ లో వెంకీ ఫిక్స్ చేయబోయే టైటిల్ ఏది??

venkatesh
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘గోపాల గోపాల’ సినిమా తర్వాత ఒక్క సినిమాని కూడా మొదలు పెట్టకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన హీరో విక్టరీ వెంకటేష్. ఇలా దాదాపు ఏడాది పాటు కెమెరాకి దూరంగా ఉన్న వెంకీ మళ్ళీ కేమెర ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. ఇటీవలే ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మారుతి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ సినిమా చేయనున్నాడు. మారుతి చెప్పిన ఫుల్ కథ నచ్చడంతో డిసెంబర్ 16న అధికారికంగా లాంచ్ చేయదానికి ముహూర్తం ఫిక్స్ చేసారని ఇదివరకే తెలియజేశాం.

ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి పలు టైటిల్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గత కొద్ది రోజుల క్రితం ‘రాధాకృష్ణ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేస్నాట్లు వారాలు కూడా వచ్చాయి. కానీ ఈ వార్తలన్నిటినీ కొట్టి పారేస్తూ మారుతి ఈ సినిమా కథకి సెట్ అయ్యేలా 4 టైటిల్స్ ని అనుకున్నాడు. అందులో ఒక దానిని వెంకీ సెలక్ట్ చేయనున్నాడు. ఆ నాలుగు టైటిల్ ఇవే.. ‘బాబు బంగారం’, ‘డైమండ్ రాజ’, ‘రాజా రత్నం’, ’24 కారెట్ బంగారం’. మరి ఈ నాలుగు టైటిల్స్ లో వెంకీ ఏ టైటిల్ ని ఓకే చేస్తాడో చూడాలి. వెంకీ ఓ కామెడీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన అందాల భామ నయనతార జోడీ కట్టనుంది. జిబ్రాన్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకి సూర్యదేవర నాగ వంశీ నిర్మాత.

Exit mobile version