‘పెద్ది’ థియేటర్స్ లో కొత్త సీన్స్ అప్పటి నుంచేనా?

Peddi

గత కొన్నాళ్ల నుంచి టాలీవుడ్ ఆశగా ఎదురు చూస్తున్న అవైటెడ్ హిట్ ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన లేటెస్ట్ సినిమా “పెద్ది” తో అందించారు. గేమ్ ఛేంజర్ లాంటి భారీ డిజప్పాయింట్మెంట్ తర్వాత ఒక్క సినిమా ఎక్స్ పీరియన్స్ ఉన్న దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఇపుడు 350 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టి అదరగొట్టింది.

అయితే రిలీజ్ అయ్యాక వచ్చిన విమర్శలను బుచ్చిబాబు సానా తీసుకొని వాటిని కరెక్ట్ చేస్తామని కూడా హామీ చేశారు. ఈ నేపథ్యంలో సినిమా మళ్ళీ ఎడిట్ చేసి ఫ్రెష్ వెర్షన్ ని థియేటర్స్ లో దింపనున్నారనే ప్రచారం కూడా మొదలైంది. సో ఫైనల్ గా పెద్ది థియేటర్స్ లో కొత్త వెర్షన్ ఈ శనివారం నుంచి ప్రదర్శితం కానున్నట్టుగా ఇపుడు వినిపిస్తుంది. జాన్వీపై కొన్ని సన్నివేశాలు తగ్గించి సెకండాఫ్ లో కూడా శివ రాజ్ కుమార్ పై ఫ్లాష్ బ్యాక్ సీన్ ని తీసి కొన్ని కొత్త సీక్వెన్స్ లని జోడించనున్నారని తెలుస్తుంది. సో దీనిపై మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version