తరుణ్ భాస్కర్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన క్రేజీ మూవీ ‘గాయపడ్డ సింహం’ ఇప్పటికే తన ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ పూర్తి కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందించాడు. ఇక ఈ మూవీ నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఫన్ రైడ్‌గా కట్ చేశారు.
అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలనేది హీరో కల. అయితే డొనాల్డ్ ట్రంప్ కఠినమైన ‘డిపోర్టేషన్’ విధానాల వల్ల ఆ కల చెదిరిపోయి, హీరో వ్యక్తిగత మరియు ప్రేమ జీవితం ఎలాంటి ఇబ్బందుల్లో పడింది అనే ఆసక్తికర అంశాన్ని ఈ ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్ అంతటా తరుణ్ భాస్కర్ తనదైన మార్క్ కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. ముఖ్యంగా తన పాత సినిమాలపైనే సెల్ఫ్ సెటైర్లు వేసుకోవడం, ‘కేజీయఫ్’ స్థాయి ఎలివేషన్లను ఒక మిడిల్ క్లాస్ కుర్రాడికి ఇవ్వడం వంటి అంశాలు ట్రైలర్‌లో బాగా పేలాయి. జేడీ చక్రవర్తి ‘బ్రూటల్ ధర్మ’గా తన ఇంటెన్సిటీని చూపించగా, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా మరియు విష్ణు ఓయ్ తదితరులు వినోదాన్ని పండించారు.
ఈ ట్రైలర్‌లో మరో ప్రధాన ఆకర్షణ శ్రీవిష్ణు. ఇందులో ఆయన ఒక కీలకమైన క్యామియో పాత్రలో కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచేశాడు. అమెరికా వెళ్లాలని తపించే తరుణ్ పాత్రకు భిన్నంగా, ఇండియాలోనే ఉండి ఏదైనా సాధించాలని నమ్మే యువకుడిగా శ్రీవిష్ణు పాత్ర ఉండబోతోందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయి. మొత్తానికి ఓ సీరియస్ ఇష్యూని ఫన్ అండ్ సెటైరిక్‌గా తెరకెక్కించాడు దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్. జీ స్టూడియోస్ మరియు సప్తస్వ మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న గ్రాండ్ రిలీజ్ కానుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
