పవర్ స్టార్ సంచలనాల ‘గబ్బర్ సింగ్’కి 2 సంవత్సరాలు.!

Gabbar Singh New Posters (12)

ఆకలి మీద ఉన్న సింహానికి జింకల సమూహం కనపడితే ఎంత్ మజా వస్తుందో అంతకంటే ఎక్కువ మజాని ‘గబ్బర్ సింగ్’ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అందించింది. ఎంతో కాలంగా సరైన హిట్ కోసం ఎందుచూస్తున్న పవన్ కళ్యాణ్ కోరికని, అతని అభిమానుల కోరికని ‘గబ్బర్ సింగ్’ సినిమా తీర్చింది. గబ్బర్ సింగ్ 2012 మే 11న విడుదలైంది అంటే నేటితో ఈ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు పూర్తయ్యింది.

ఈ సినిమా విజయంతో ముగ్గురు రాత్రికి రాత్రే ఇండస్ట్రీలో స్టార్స్ అయిపోయారు. వారెవరో కాదు బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్, డైరెక్టర్ హరీష్ శంకర్ మరియు హీరోయిన్ శృతి హాసన్. అప్పటి వరకూ ఒక్క సరైన హిట్ కూడా లేని శృతి హాసన్ ఒక్క సారిగా టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోవడమే కాకుండా ఆఫర్ల వెల్లువతో బిజీ బిజీ హీరోయిన్ అయిపొయింది. అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు. తన బ్యానర్ కి సరైన సక్సెస్ ఇవ్వాలనే కసితో పనిచేసిన బండ్ల గణేష్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ నిర్మాతగా మారిపోయి ప్రస్తుతం ఇండస్ట్రీలోని టాప్ హీరోస్ తో సినిమాలు చేస్తున్నారు. వీరితో పాటు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి స్పెషల్ హైలైట్.

అంతే కాకుండా ఈ సినిమా అప్పటి వరకూ ఉన్న రికార్డులన్నిటినీ బద్దలు కొట్టుకుంటూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండవ సినిమాగా నిలిచిపోయింది. ‘గబ్బర్ సింగ్’ వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ సినిమా సీక్వెల్ ‘గబ్బర్ సింగ్ 2’ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సీక్వెల్ షూటింగ్ జూన్ నుండి మొదలయ్యే అవకాశం ఉంది.

Exit mobile version