పెదనాన్న ఎఫెక్ట్ నుండి తప్పించుకున్న వరుణ్ తేజ్

Varun Tej

హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రం గత నెల 20న విడుదలై ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. మొదటి నాలుగు రోజులు చిత్రం బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత కొద్దిగా నెమ్మదించినా 11వ రోజు వరకు మంచి రన్ కనబర్చింది. కానీ ఆ తర్వాతే కష్టాలు మొదలయ్యాయి.

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ విడుదలతో అన్ని సినిమాల మాదిరిగానే వరుణ్ సినిమా కూడా ఇబ్బందుల్లో పడింది. థియేటర్ల కొరతతో పాటు వసూళ్లు కూడా డైవర్ట్ అయిపోయాయి. దీంతో 2వ తేదీ నుండి వసూళ్లలో హెవీ డ్రాప్ కనబడింది. ఆ డ్రాప్ చూసి సినిమా బ్రేక్ ఈవెన్ అమౌంట్ రూ.25 కోట్లు రావడం కష్టమే అనుకున్నారు ట్రేడ్ అనలిస్టిలు.

కానీ చిత్రం మాత్రం కొంత డ్యామేజ్ జరిగినా త్వరగానే కోలుకుంది. ‘సైరా’ విడుదలైన రెండు రోజుల తర్వాత ‘గద్దలకొండ గణేష్’ వసూళ్లు కొద్దిగా మెరుగుపడ్డాయి. తద్వారా చిత్రం 17 రోజులకు గాను రూ. 24.2 కోట్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ దగ్గరకు చేరుకుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుండే రూ.21 కోట్లు వరకు వసూలయ్యాయి. ఫుల్ రన్ ముగిసేనాటికి సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పాతిక కోట్ల మార్క్ చేరుకుని సేఫ్ ప్రాజెక్ట్ అయ్యే పరిస్థితి కనబడుతోంది.

Exit mobile version