గాయకులుగా మారిన ‘గడ్డం గ్యాంగ్’

Gaddam-Gang
సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో శివాని-శివాత్మిక మూవీస్ పతాకంపై జీవితా రాజశేఖర్ నిర్మిస్తున్న సినిమా ‘గడ్డం గ్యాంగ్’. రాజశేఖర్ సరసన షీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు పి.సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత దర్శకుడు అచ్చు ‘గడ్డం గ్యాంగ్’ సినిమాతో నటుడిగా పరిచయం అవుతున్నారు. అతనే ఈ సినిమాకు సంగీత దర్శకుడు. త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.

‘సినిమాలలో నటీనటులు గాయకులుగా మారారు. నేను కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాను. త్వరలో ‘గడ్డం గ్యాంగ్’ ట్రైలర్ మీ ముందుకు వస్తుంది.’ అని సంగీత దర్శకుడు అచ్చు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

ఇప్పటికే విడుదలైన ‘గడ్డం గ్యాంగ్’ ఫస్ట్ లుక్ పోస్టర్లు, ప్రోమో వీడియోలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఇవి చాలా విభిన్నంగా ఉన్నాయి. తమిళ సినిమా ‘సూదు కవ్వమ్’కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో గత ఏడాది నవంబర్ నెలలో విడుదలైంది. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Exit mobile version