కిచ్చా సినిమాతో కన్నడ డెబ్యూ ఇస్తున్న ‘గేమ్ ఛేంజర్’ నటుడు

mark 1

కన్నడ స్టార్ హీరోస్ లో ఒకరైన కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “మార్క్”. ఒక సాలిడ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు విజయ్ కార్తికేయ తెరకెక్కించిన ఈ సినిమా మంచి హైప్ ని సెట్ చేసుకుంది. ఇక ఈ సినిమాతో మన టాలీవుడ్ కి చెందిన టాలెంటెడ్ నటుడు కన్నడ డెబ్యూ ఇస్తున్నాడు. మరి అతనే యంగ్ హీరో నవీన్ చంద్ర.

ఈ ఏడాదిలో గేమ్ ఛేంజర్ సహా పలు చిత్రాలు మెయిన్ గా మంచి థ్రిల్లర్స్ ని హీరోగా చేసి తెలుగు ఆడియెన్స్ ని థియేటర్స్ లో ఓటిటితో పాన్ ఇండియా ఆడియెన్స్ ని పలకరించిన తాను మార్క్ లో కూడా సాలిడ్ రోల్ చేసినట్టుగా లేటెస్ట్ పోస్టర్ తో అర్ధం అవుతుంది. మరి ఈ సినిమాలో తనకి ఎలాంటి రోల్ పడింది, కన్నడ సినిమాలోకి ఎలాంటి ఎంట్రీ ఇస్తున్నాడు అనేది తెలియాలి అంటే ఈ డిసెంబర్ 25 వరకు ఆగాల్సిందే. సుదీప్ ఈ సినిమాని కన్నడ, తెలుగు సహా హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

Exit mobile version