ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు సుకుమార్ తో ఓ భారీ సినిమా చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. చరణ్ కెరీర్ 17వ సినిమాగా మేకర్స్ భారీ లెవెల్లో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కి చరణ్ లేటెస్ట్ గా కొత్త లుక్స్ తో కిక్ ఇస్తున్నాడు. గత సినిమా పెద్ది కోసం పెంచిన పొడవాటి శిరోజాలు అలానే ఉంచి మిగతా బాడీ అంతా స్లిమ్ చేసేసాడు.
దీనితో సుకుమార్ సినిమాలో చరణ్ లుక్ అదిరేలా ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే చరణ్ గేమ్ ఛేంజర్ లోనే మూడు వెరియేషన్స్ చూపించి ట్రాన్స్ఫార్మమేషన్ అంటే ఏంటో తన డెడికేషన్ తో ఆశ్చర్య పరిచాడు. మళ్లీ పెద్ది లో కూడా పలు షేడ్స్ ఇపుడు మళ్లీ సుకుమార్ ప్రాజెక్ట్ కోసం కొత్తగా మారిపోయాడు.
ఇలా సినిమా సినిమాకి ఇంత భిన్నంగా కనిపించడం అనేది రామ్ చరణ్ తాలూకా డెడికేషన్ ని చూపిస్తుంది. ఇక సుకుమార్ సినిమాకి ఒకటే లుక్ ఉంటుందా లేక గత సినిమాల్లో లానే రెండు మూడు ఉంటాయా అనేది వేచి చూడాలి.


