“గ్యాంగ్ లీడర్ ” ప్రారంభం !

gang3

మనిషా ఆర్ట్స్ ప్రై.లి. సమర్పణలో మానిక్యం మూవీస్, ఎస్ ఎం కె ఫిలిమ్స్ సంయుక్తంగా “బావ మరదలు” ఫేమ్ మోహనకృష్ణ హీరోగా రవికిశోర్ బాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్ర షూటింగ్ ఫిలిమ్ ఛాంబర్ లో మొదలైంది. ఈ చిత్రానికి క్లాప్ వి.సాగర్ కొట్టగా మనిషా ఆర్ట్స్ ప్రై. లి.అధినేత కిషోర్ రాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రవికిశోర్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. హీరో మోహన్ కృష్ణ మాట్లాడుతూ…సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20నుంచి మొదలవుతుంది. చిరంజీవిగారు గ్యాంగ్ లీడర్ చిత్రం పేరు పెట్టడానికి కారణం ఆ చిత్రం లో లాగానే నలుగురు స్నేహితులు కలిసి సమాజంలో జరిగే అవినీతి ని ఎలా ఎదుర్కున్నారు అనేది కథ అని అన్నారు.

నటీనటులు: మోహన్ కృష్ణ, విజయ హరిని, సుమన్, తనికెళ్ళ భరణి , రంగస్థలం మహేష్, చిత్రం శ్రీను,నాగబాబు, రావూరి రమేష్, అప్పారావు,ఎల్ బి శ్రీరామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం; రమేష్ నాయుడు, ఎడిటిర్; నందమూరి హరి, కెమేరా మెన్; మురళి, ప్రొడ్యూసర్; సింగులూరి మోహనరావు, దర్శకత్వం; రవి కిషోర్ బాబు.

Exit mobile version