కార్తీక్ భాగ్యరాజా రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. ఈ సినిమాలో దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఆయన డేవిడ్ థామస్ అనే పాత్రలో కనిపిస్తున్నారు.
ఈ చిత్రం కోసం ‘క్యారెక్టర్ రివీల్ వీక్’ను ప్రారంభించినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. అందులో భాగంగానే గౌతమ్ మీనన్ లుక్‌ను మొదటగా పరిచయం చేశారు. రానున్న రోజుల్లో సినిమాలోని ఇతర పాత్రల వివరాలు, పోస్టర్లను వరుసగా వెల్లడించనున్నారు.
అంతరిక్షంలోకి ప్రయాణించాలనే లక్ష్యం ఉన్న ఒక యువతి కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఆ కలను నెరవేర్చుకునే క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, భావోద్వేగాల నేపథ్యంలో కథ సాగుతుంది.
ఈ చిత్రానికి కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. యువన్‌కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్, మనస్విని భాగ్యరాజా సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
