మోహన్ బాబు హీరోగా, విలన్ గా రెండు విభిన్న పాత్రల్లో నటించిన గాయత్రి సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మదన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కు డైమండ్ రత్నబాబు కథ మాటలు అందించారు. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం కానుందని సమాచారం. ఈ సినిమా ట్రైలర్ కు మంచి ఆదరణ లభించింది కావున సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
సినిమాకు పాజిటివిటి ఉంది. సినీ పరిశ్రమలో ఈ సినిమా చుసిన కొందరు మంచి చిత్రంగా ఈ సినిమాను కొనియాడడం విశేషం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో మంచు విష్ణు శ్రియ చేసింది చిన్న పాత్ర అయినా ప్రేక్షకులను అలరిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు రేపు సాయి ధరమ్ తేజ్ నటించిన ఇంటిలిజెంట్ సినిమా విడుదల కాబోతుండడం విశేషం.
