సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ “గేదెల రాజు”. చైతన్య మోటూరి దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జర్నలిస్టుల చేతుల మీదుగా ఘనంగా విడుదల చేశారు. మోటూరి టాకీస్ బ్యానర్‌పై వాణి రవికుమార్ మోటూరి నిర్మిస్తున్న ఈ సినిమా, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది.
ఈ సందర్భంగా దర్శకుడు చైతన్య మోటూరి మాట్లాడుతూ.. ఇదొక క్రిస్ప్ క్రైమ్ థ్రిల్లర్ అని, రెండు గంటల ఒక్క నిమిషం నిడివితో ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుందని తెలిపారు. ఇందులో హీరోలు, విలన్లు ఉండరని, కేవలం పాత్రలే ఉంటాయని చెప్పారు. మలయాళ సినిమాల స్థాయిలో ఈ చిత్రాన్ని 84 లొకేషన్లలో, కాకినాడ రియల్ క్రౌడ్ మధ్య సహజంగా తెరకెక్కించామన్నారు. కుమారుడి అభిరుచిని ప్రోత్సహించేందుకే ఈ సినిమాను నిర్మించినట్లు నిర్మాత వాణి రవికుమార్ తెలిపారు.
సినిమాలో కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, తమ చిత్రంలో ఆ కంటెంట్ పుష్కలంగా ఉందని చిత్ర సమర్పకుడు, నటుడు రఘు కుంచె ధీమా వ్యక్తం చేశారు. ట్రైలర్ నచ్చితే 17న థియేటర్లకు వచ్చి సినిమాను ఆదరించాలని కోరారు. ఈ సినిమాలో రఘు కుంచె నటన ఎస్వీఆర్, కైకాల సత్యనారాయణలను గుర్తుచేస్తుందని నటుడు కిష్టయ్య ప్రశంసించారు. రవి ఆనంద్, రామచంద్రం, శ్రావ్య, మౌనిక తదితరులు తమ పాత్రల గురించి వివరిస్తూ.. కొత్తవారిని ఆశీర్వదించాలని ప్రేక్షకులను కోరారు.
