
‘కధ’ అనే సినిమాలో జెనిలియాసరసన హీరోగా పరిచయమైన నటుడు అర్జున్. ఆ సినిమా ఓ మాదిరిగా ఆడినా, అర్జున్ కి ప్రశంసలు అందినా తరువాత తెరపైనుండి కనుమరుగైపోయాడు
ప్రస్తుతం పలు తమిళ సినిమాలలో బిజీగా వున్న ఈ హీరో త్వరలో చాలా గ్యాప్ తరువాత ఒక తెలుగు సినిమాలో నటించాడు. వీకెండ్ లవ్ పేరుతొ ఈ సినిమా రేపు విడుదలకానుంది. గతంలో జర్నలిస్ట్ గా పనిచేసిన నాగు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు
ఈ వీకెండ్ లవ్ సినిమా ప్రస్తుత కాలానికి తగ్గట్టు మలచిన ప్రేమకధా చిత్రంగా తెరకెక్కింది. మరి ఈ సినిమాతోనైనా జెనిలియా హీరోకి బ్రేక్ రావాలని ఆశిద్దాం