జ్ఞానసరస్వతీ ఆలయ నిర్మాణంలో ‘పురాణపండ’ మహా గ్రంధాన్ని పంచుతున్న తోట సుబ్బారావు

రాజమహేంద్రవరం : మే 10

జ్ఞానమే మహారూపమెత్తిన జ్ఞానాంబికగా ఆంధ్ర ప్రదేశ్ రాజమహేంద్రవరంలో అపూర్వరీతిలో ‘ జ్ఞాన సరస్వతీ దేవాలయాన్ని ‘ నిర్మిస్తున్నారు. పవిత్ర గోదావరీ తీరంలో సరస్వతి ఘాట్ లో కోట్లాది రూపాయలతో రూపుదిద్దుకుంటున్న ఈ ఆలయ నిర్మాణానికి ప్రముఖ కాంట్రాక్టర్ , గౌతమీఘాట్ దేవాలయాల సమాఖ్య అధ్యక్షులు తోట సుబ్బారావు కీలక సూత్రధారిగా వ్యహరిస్తున్నారు.

గోదావరి జిల్లాలలో సంస్కారవంతమైన ఉత్తమ కీర్తిని సంపాదించుకున్న తోట సుబ్బారావు ఈ మహా ‘ జ్ఞాన సరస్వతీ దేవాలయ నిర్మాణ మహాక్రతువులో అహోరాత్రాలు శ్రమిస్తూ ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ సలహా సహకారాలతో పాటు, భక్తుల సహకారంకూడా తోట సుబ్బారావు ఆశిస్తున్నారు.

ఇక్కడికొచ్చే ప్రతీ భక్తుడికీ అక్షర ప్రసాదంగా ఒక మంచి ఉత్తమ ధార్మిక గ్రంధాన్ని బహూకరిస్తున్నారు. తెలుగురాష్ట్రాల లోగిళ్ళలో ఆనంద మంగళధ్వనుల్ని ఆవిష్కరించే ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలనే ఇక్కడ ఎక్కువగా భక్త బృందాలకు పంచడాన్ని విశేషంగానే చెప్పాలి.

సగభాగం అద్భుతంగా నిర్మాణం పూర్తయ్యి మరికొన్ని నెలల్లో మహా మంగళ సరస్వతీ దేవాలయంగా ఈదేశానికి అంకితమవుతున్న సరస్వతీ దేవాలయ సామ్రాజ్యం తెలుగువారికి మరొక బాసరగా సాక్షాత్కరించబోతోంది. ఎందరో ధార్మిక వేత్తలు, రాజకీయ ప్రముఖులు , పీఠాధిపతులు ముందుగానే ఈ ఆలయ నిర్మాణాల్ని దర్శించి తోట సుబ్బారావు మహా సంకల్పాన్ని ప్రశంసించడం ముదావహం.

గతంలో రాజమహేంద్రవరం రామకృష్ణ మఠాధిపతులు వినిశ్చలానంద మహారాజ్, మళయాళ పీఠాధిపతులు పరిపూర్ణానందగిరి స్వామీజీ , ధార్మిక ఉపన్యాసకులు మైలవరపు శ్రీనివాస రావు, ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్, ప్రముఖ సినీ నేపధ్య గాయని సునీత, ప్రముఖ పండితులు ధూళిపాళ మహాదేవమణి, మైలవరపు శ్రీనివాస రావు, గత పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, మురళీమోహన్ , తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పూర్వ సభ్యులు రౌతు సూర్యప్రకాశ రావు, వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ,డాక్టర్ గన్ని భాస్కర రావు , వై ఎస్ ఆర్ సి పి జిల్లా నాయకులు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం , తదితర ప్రముఖులెందరో ఈ దేవాలయ నిర్మాణ సందర్భంలో దర్శించుకున్నారు .

ఈ ఉదయం ఆలయాన్ని సందర్శించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కి ఆలయమర్యాదలతో స్వాగతంపలికిన తోట సుబ్బారావు ఈ జ్ఞానసరస్వతీ మహా దేవాలయ నిర్మాణ విశేషాల్ని వివరించి, ఘనంగా సత్కరించారు. ఆలయానికి విచ్ఛేసిన వారందరికీ పురాణపండ శ్రీనివాస్ అఖండ ఆంజనేయ విశేష గ్రంధం’ నన్నేలు నా స్వామి ‘ ని తోట సుబ్బారావు బహూకరించడం ఆందరినీ ఆకట్టుకుంటోంది.

ఒక వైపు స్థానికంగా వున్న దేవాలయాల దర్మకర్తలకు కూడా ఈ మహావైభవ గ్రంధాన్ని తోట సుబ్బారావు సంస్కార సమర్పణంగా అందిస్తుండగా , మరొకప్రక్క తోట సుబ్బారావుకు అత్యంత సన్నిహితులైన రాజమహేంద్రవరం ధార్మిక సేవకులు, నిత్యసమాజ సేవాభిలాషి చెన్నాప్రగడ శ్రీనివాస్ { అహుజా బాబు } పోలీస్ ఉన్నతాధికారులకు ఈ బుక్ ను బహూకరించడంతో ఈ ఆంజనేయ మహా గ్రంధం రాజమహేంద్రవరం నగరంలో విశేషమైన పవిత్ర సంచలనం సృష్టిస్తోంది.

రెండునెలల క్రింద భారతదేశ హోంశాఖామంత్రి అమిత్ షా దివ్య హస్తాలతో న్యూఢిల్లీ మహానగరంలో అత్యంత వైభవంగా ఆవిష్కరణ జరుపుకున్న పురాణపండ శ్రీనివాస్ మహా అఖండ ఆంజనేయ మహాగ్రంధం ‘ నన్నేలు నా స్వామి ‘ ఇప్పటికే దశ దిశలా జగజ్జేగీయమాన వెలుగుల్ని విరజిమ్ముతోంది . ఇప్పటికే పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంధాలు తెలుగురాష్ట్రాల ఎల్లలు దాటి విదేశీ తెలుగు ప్రముఖులకు కూడా నిత్యపారాయణ కావడం ప్రముఖంగానే చెప్పుకోవాలి.

అమరత్వాన్ని ప్రసాదించే అమృత జ్ఞానసరస్వతీ మహా దేవాలయం వర్ణ సమామ్నాయంతో, భాషా సామ్రాజ్యంగా , వేదం ప్రామాణ్యంగా అతి త్వరలోనే పూర్తిచేసి …
లోకోత్తర లావణ్యాన్ని భక్తబృందాలకు అందించాలనే ఉద్దేశంతో ఒక దీక్షగా , నిస్వార్ధంగా నిర్మాణం సాగిస్తున్నట్లు తోట సుబ్బారావు ఈ సందర్భంగా చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక, ధార్మిక, రాజకీయ వర్గాల ప్రముఖులు తోట సుబ్బారావు అఖండ సంకల్పాన్ని అభినందిస్తున్నారు.

Puranapanda Srinivas, Thota Subba Rao

Exit mobile version