మన టాలీవుడ్ లో తన సినిమాలకి అంటూ ఒక సెపరేట్ మార్కెట్ ని సొంతం చేసుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోస్ లో నిఖిల్ సిద్ధార్థ కూడా ఒకరు. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రాలు చేస్తూ ఇప్పుడు భారీ పాన్ ఇండియా చిత్రం “స్వయంభూ” (Swayambhu) తో రాబోతున్నాడు. అయితే లేటెస్ట్ గా వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే దానిని హెచ్ డి ఆర్ లోకి కూడా మార్చి మరింత క్వాలిటీతో అప్డేట్ చేశారు.
ఇదంతా బాగానే ఉంది కానీ లేటెస్ట్ గా ఈ టీజర్ తోనే నిఖిల్ వేసిన పోస్ట్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. తమ టీజర్ ని యూట్యూబ్ ఎందుకు భయ్యా గ్లిట్జ్ లు.. టీజర్ ని మళ్ళీ అప్ లోడ్ చేసాం అంటూ చివరలో ఒక్క పాయింట్ ని మాత్రం నొక్కి చెప్పడం వైరల్ గా మారింది. రీసెంట్ గా వచ్చిన ఓ సినిమాలా మా చిత్రంలో ఎలాంటి ఏ ఐ ని వినియోగించలేదు అంటూ చెప్పడం అసలు పాయింట్ గా మారింది.
దీనితో అసలు ఆ సినిమా ఏంటి? రీసెంట్ గా అంటే ఈ మధ్యలోనే వచ్చిన విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన సినిమాల జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్స్ త్రవ్వుతున్నారు. మరి ఆ సినిమా ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అలాగే నిఖిల్ ఎందుకు ఇలాంటి ట్రిగ్గర్ చేసే పోస్ట్ చేసినట్టు అని కూడా పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి.
