దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇంట్లో చోరీ!

Puri-Jagannadh
ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇదే విషయమై ఆయన శుక్రవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కుటుంబంలో ఎవరూ ఇంట్లో లేని సమయంలో 15లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎవరో చోరీ చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు ఆ మేరకు విచారణ చేపట్టారు. అయితే పూరీకి తెలిసిన వారే ఈ పని చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం పట్ల పూర్తి సమాచారాన్ని ఈ మధ్యాహ్నం పోలీసులు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version