ప్రముఖ సంస్థ చేతికి ఏబిసిడి హిందీ శాటిలైట్ హక్కులు !

Shrirish

‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రం తో కెరీర్ లో తొలి సూపర్ హిట్ ను అందుకున్నాడు యువ హీరో అల్లు శిరీష్. ఈచిత్రం తరువాత ఆయన నటించిన ‘ఒక్క క్షణం’ పర్వాలేదనిపించిన ‘1971 బియాండ్ బోర్డర్స్’ నిరాశ పరిచింది. ఇక ఈచిత్రాల తరువాత శిరీష్ ప్రస్తుతం మలయాళ విజయం సాధించిన ఏబిసిడి (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి ) రీమేక్ లో నటిస్తున్నాడు. ఈచిత్రం తెలుగులోనూ అదే టైటిల్ తో తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న విడుదలకానుంది. ఇక ఈచిత్రం యొక్క హిందీ శాటిలైట్ అలాగే డిజిటల్ రైట్స్ ను గోల్డ్ మైన్ టెలి ఫిలిమ్స్ దక్కించుకుంది. ఇంతకుముందు ఈ సంస్థ అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు , డీజే’ చిత్రాల హిందీ శాటిలైట్ హక్కులను దక్కించుకుంది.

సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రుక్సార్ మీర్ హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్ బెన్ సినిమాస్ , మధుర ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Exit mobile version