మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంటున్న పూరి !

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరిని పూర్తిస్థాయి హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘మెహబూబా’. ప్రాజెక్ట్ మొదలైన దగ్గర్నుండి మొదటి సినిమా ‘ఆంధ్రపోరి’తో సరిగా మేపించలేకపోయిన ఆకాష్ ను పూరి తన డైరెక్షన్లో ఎలా చూపిస్తారో చూడలని అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఈ తరుణంలోనే ఈ సినిమా యొక్క ట్రైలర్ మొన్ననే విడుదలైంది.

ట్రైలర్ చూసియాన్ చాలా మంది ఆకాష్ పూరి చాలా కాన్ఫిడెంట్ గా, హీరో మెటీరియల్ గా కనిపిస్తున్నాడని, అతని స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ కూడ ఆకట్టుకున్నాయని అంటున్నారు. పూరి గురువు రామ్ గోపాల్ వర్మతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడ పూరిని, ఆకాష్ ను అభినందిస్తున్నారు.

మే 11న విడుదలకానున్న ఈ చిత్ర రిలీజ్ హక్కుల్ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు. నూతన నటి నేహా శెట్టి కథానాయకిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు సందీప్ చౌత స్వరాలు అందించారు.

Exit mobile version