ఎన్టీఆర్ , చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !

RRR

టాలీవుడ్ అగ్ర హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీ స్టారర్ చిత్రంలో నటించనున్నారని తెలిసిందే. ఇక ఈ చిత్ర షూటింగ్ మొదట డిసెంబర్ లో ప్రారంభం కానుందని వార్తలు వచ్చాయి. అయితే సినీ వర్గాల నుండి వస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కొంచెం ముందుగానే ప్రారంభం కానుందట.

నవంబర్ మొదటివారంలో ఈచిత్రం యొక్క మొదటి షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈషెడ్యూల్ లో ఎన్టీఆర్ , చరణ్ ఇద్దరు పాల్గొననున్నారు. ఇక ఈచిత్రంలో నటించే కథానాయికలను ప్రకటించాల్సివుంది. సుమారు 200కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో దానయ్య డీవీవీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version