
అక్కినేని మూడవ తరం హీరోగా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న యంగ్ హీరో అఖిల్ అక్కినేని. టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్ లో అఖిల్ హీరోగా తన మొదటి సినిమా చేస్తున్నాడు. 85% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ సౌత్ ఆఫ్రికాలో జరగనుంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫైనలైజ్ కాలేదు కానీ ఇప్పటికే రిలీజ్ చేసిన మేకిండ్ వీడియోస్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దాంతో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ సూపర్బ్ గా జరుగుతోంది.
ఇప్పటికే నైజాం మరియు కృష్ణా జిల్లా శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడు పోగా సీడెడ్ రైట్స్ కి సంబందించిన బిజినెస్ చర్చల దశలో ఉంది. ఆంధ్ర ఏరియాలోని మిగిలిన ఏరియాలకి సంబందించిన బిజినెస్ లు కూడా చాలా జోరుగా జరుగుతున్నాయి. మాకు అందిన పలువురి డిస్ట్రిబ్యూటర్స్ సమాచారం ప్రకారం ఒక్క ఆంధ్ర రీజియన్(9 జిల్లాలను కలుపుకొని)లోనే సుమారు 18 కోట్లకి ఈ సినిమా రైట్స్ అమ్ముడు పోతాయని సమాచారం. ఓవరాల్ గా బిజినెస్ పరంగా 50 కోట్ల మార్క్ క్రాస్ చేసేస్తుందని అంటున్నారు. మరి బిజినెస్ పరంగా ఈ రేంజ్ లో ఉన్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా అదే స్థాయి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందేమో చూడాలి.
అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానున్న ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. నితిన్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ – అనూప్ రూబెన్స్ కలిసి మ్యూజిక్ అని అందించారు.