‘బాహుబలి’కి మతిపోయే ఓపెనింగ్స్

baahubali

గత మూడేళ్ళుగా తెలుగు సినీ లవర్స్ ఎదురు చూసిన ఇండియన్ ఫస్ట్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ బాహుబలి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బెనిఫిట్ షోస్ తోనే బాహుబలి అనేది మునుపెన్నడూ చూడని ఓ గ్రాఫికల్ వండర్ అంటున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించడం ప్రభాస్ – రాణాలు హీరో – విలన్స్ గా కనిపించిన ఈ సినిమా అంచనాలను అందుకోవడమే కాకుండా అన్ని ఏరియాల నుండి భారీ ఓపెనింగ్స్ ని రాబట్టుకుంటోంది.

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ సూపర్బ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కనీ వినీ ఎరుగని ఓపెనింగ్స్ ని రాబట్టుకుంటున్నాయి. ఒక్క ఆంధ్ర, తెలంగాణ, తమిళ్ నాడు, కేరళ, నార్త్ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో రికార్డ్స్ ఓపెనింగ్స్ ని సాధించింది బాహుబలి. బాహుబలి ఓపెనింగ్స్ చూసిన ట్రేడ్ పండితులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. తమన్నా, అనుష్క హీరోయిన్స్ గా కనిపించిన ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా వారు నిర్మించారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి సాబు సిరిల్ ఆర్ట్ డైరెక్టర్.

Exit mobile version