నెక్స్ట్ మూవీ కోసం గట్టిగా వర్కౌట్ చేస్తున్న “చైతూ”

NC23 2

అక్కినేని నాగ చైతన్య కస్టడీ చిత్రంతో ప్రేక్షకులని అలరించలేకపోయాడు. ఇప్పుడు డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం లో ఒక చిత్రం ను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో తన పాత్ర కోసం, సినిమా కోసం హీరో నాగ చైతన్య గట్టిగానే వర్కౌట్ చేస్తున్నారు. మత్స్య కారులతో హీరో నాగ చైతన్య ఇంటరాక్ట్ అయ్యారు. వారి కుటుంబాలను కలుసుకొని వారి జీవన శైలి, తీరు గురించి తెలుసుకుంటున్నారు.

అయితే పూర్తి వివరాలతో స్క్రిప్ట్ ను మరింత సాలిడ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ అయినట్లు తెలిపారు. త్వరలో సినిమా సెట్స్ మీదకు రానుంది. మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో ను చూస్తే, సినిమా కోసం ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. బన్నీ వాసు నిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Exit mobile version