
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోడరన్ శ్రీకృష్ణుడిగా నటిస్తున్న సినిమా ‘గోపాల గోపాల’. విక్టరీ వెంకటేష్ నాస్తికుడిగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. అధికారికంగా ప్రకటించలేదు. అదే రోజున శర్వానంద్, నిత్యా మీనన్ జంటగా నటించిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాను విడుదల చేయాలని సమర్పకులు కెఎస్ రామారావు భావిస్తున్నారు.
‘దర్శకుడు క్రాంతి మాధవ్ కథను ఎంత బాగా చెప్పాడో అంత కంటే అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు. ఇదొక అందమైన ప్రేమకావ్యం. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాను. ప్రేమకథ కాబట్టి… ఇతర సినిమాలకు పోటీ కాదు, ఉండదు’ అని కెఎస్ రామారావు వ్యాఖ్యానించారు. నిజంగా పవన్ కళ్యాణ్ సినిమాతో శర్వాకు పోటి ఉండదా..? వెయిట్ & సి.
ఇటీవలే విడుదలైన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ స్వరాలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేపింది. శర్వానంద్ క్రీడాకారుడిగా కనిపించనున్నారు. నిత్యా ముస్లిం యువతి పాత్ర పోషించారు.