‘గోపాల గోపాల’ సంక్రాంతి బారి నుంచి తప్పుకున్నట్టేనా.?

gopala-gopala
టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన విక్టరీ వెంకటేష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’. బాలీవుడ్ సూపర్ హిట్ హిందీ మూవీ ‘ఓ మై గాడ్’ కి ఇది రీమేక్. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తనకి జరిగిన నష్టాని దేవుడిపై కేసు వేస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ చుట్టూ ఈ తిరుగుతుంది. ఈ చిత్ర టీం ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు. అప్పటి నుంచి పవన్, వెంకీ మరియు సినీ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం మాకు తెలిసిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘గోపాల గోపాల’ సంక్రాంతి బరి నుంచి తప్పుకోనుంది. దానికి కారణం ఈ సినిమాకి సంబందించిన సినిమా షూటింగ్ చాలా పెండింగ్ ఉండడమే. మాకు తెలిసిన దాని ప్రకారం 20 రోజుల షూటింగ్ బాలన్స్ ఉంది. ఈ 20 రోజుల్లో పవన్ కళ్యాణ్ పై ఓ పాటని, వెంకటేష్ పై ఓ పాటని అలాగే కాలనీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొంత టాకీ పార్ట్ ని షూట్ చేయాల్సి ఉంది. షూట్ పూర్తి చేసాక పవన్ కళ్యాణ్ పాత్రకి చెయ్యాల్సిన సిజి వర్క్ కూడా పెండింగ్ ఉంది. ఇలా అన్నీ పూర్తి చేసుకొని సంక్రాంతి కల్లా రిలీజ్ చేయలేమనే ఉద్దేశంతో ఈ చిత్ర టీం రిలీజ్ ని వెనక్కి వేసే పనిలో ఉన్నారు.

కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డి. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవకపోతే వేరే సినిమాలు బరిలో దిగే అవకాశం ఉంది. మరి ఈ సంక్రాంతికి ఏయే ఏయే సినిమాలు రిలీజ్ అవుతాయో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..

Exit mobile version