
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న టాలీవుడ్ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని నవంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు ఇది వరకే తెలియజేశాం. ఈ చిత్ర టీం ఫస్ట్ లుక్ కి ఓ స్పెషల్ ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసారు . ఈ రోజు సాయంతం 4 గంటలకి గోపాల గోపాల ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేస్తారు.
ఇప్పటికే గోపాల గోపాల చిత్ర టీం ఫస్ట్ లుక్ ని చూసిన ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఫస్ట్ లుక్ చాలా బాగుందని అంటున్నారు. ఫస్ట్ లుక్ రిలీజ్ కి ముందే ప్రముఖుల నుంచి ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుండడంతో ఫస్ట్ లుక్ పై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున ఈ సినిమాని డి. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. వెంకటేష్ కి జోడీగా శ్రియ శరన్ నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్.