సంక్రాంతికి ఏకైక పెద్ద చిత్రంగా ‘గోపాల గోపాల’?

Gopala_Gopala_Movie
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న ‘ఓ మై గాడ్’ సినిమాను తెలుగులో ‘గోపాల గోపాల’గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసినదే. భారీ తారల మ,మధ్య గట్టి పోటీగా నిలిచే సంక్రాంతి పండగ రోజున ఈ ఒక్క సినిమా మాత్రమే పెద్ద చిత్రాలలో ఒకటిగా విడుదలకానుంది

మరో సినిమా ఎన్ .టి.ఆర్ – పూరి ల చిత్రం అని ముందుగా అనుకున్నా ఇప్పటికీ ఆ చిత్రం మొదలుకాని నేపధ్యంలో అనుకున్న గడువుకు విడుదలయ్యే సూచనలు లేవు. రెగ్యులర్ షూటింగ్ మొదలవడానికి పలు కారణాల కారణంగా జాప్యం జరుగుతుంది గనుక ఈ సినిమా సంక్రాంతి బరిలోనుండి తప్పుకున్నట్టే

కాబట్టి ప్రస్తుత పరిస్థితుల నడుమ సంక్రాంతి మాహారాజులుగా పవన్, వెంకీలు ఒక వెలుగు వెలగనున్నారన్నమాట

Exit mobile version