కాస్త ఆలస్యంగా రానున్న మ్యాచో మెన్ “సీటీమార్”.!

కాస్త ఆలస్యంగా రానున్న మ్యాచో మెన్ “సీటీమార్”.!

Published on Mar 27, 2021 9:18 PM IST


మన టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ అండ్ అండర్ రేటెడ్ హీరోల్లో మ్యాచో మెన్ అలాగే యాక్షన్ హీరోగా పిలవబడే గోపీచంద్ కూడా ఒకడు. మరి ఇప్పుడు గోపీచంద్ హీరోగా పలు ఆసక్తికర సినిమాలనే చేస్తున్నాయి. అయితే వాటిలో మొదట వరుసలో ఉన్నది దర్శకుడు సంపత్ నంది తో ప్లాన్ చేసిన స్పోర్ట్స్ మసాలా డ్రామా “సీటీమార్” ఉంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఇప్పుడు డీసెంట్ బజ్ నడుమ ఉంది.

అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడో వచ్చే ఏప్రిల్ 2న విడుదలకు కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆ డేట్ నుంచి తప్పుకుందట. మరి కొత్త డేట్ ను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.ఇక ఈ చిత్రంలో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా కనిపించనున్నాడు. అలాగే స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

తాజా వార్తలు