
మెగాస్టార్ చిరంజీవి.. ఒకప్పుడు ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించిన పేరు.. సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు చేయడం మానేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా దెబ్బతినడంతో చిరు మళ్ళీ సినిమాలపై దృష్టి సారించాడు. అందులో భాగంగానే తన 150వ సినిమాకి గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అదే విధంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా ఎదురు చూస్తుండడం విశేషం..
అసలు విషయం లోకి వెళితే చిరంజీవి పీసీసీ నాయకులతో కలిసి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చిరుని తన 150వ సినిమా గురించి నరసింహన్ అడిగితే ‘150వ సినిమాకి సంబందించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం, సుహాసిని వచ్చి కలిసారు. ‘నాయకుడు’ సినిమాలో కమల్ హాసన్ పోషించిన లాంటి పాత్ర చేస్తే బాగుంటుందని మణిరత్నం అన్నాడని’ చిరు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీన్నిబట్టి నరసింహన్ కూడా చిరు 150వ సినిమా కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మణిరత్నం ఇప్పటికే కథ చెప్పాడని ఈ కథపై చిరు కూడా మొగ్గు చూపినట్లు తెలిస్తోంది. చిరుతో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా నటించే అవకాశమున్న ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నట్లు సమాచారం.. ఈ కాంబినేషన్ లో మూవీ వస్తే ఎలా ఉంటది అనే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలపండి..