లండన్ పుట్టి పెరిగి అక్కడ సంస్కృతికి అలవాటు పడిన ఒక కుర్రాడు(అభిరామ్).. తన కుటుంబ మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఒక పల్లెటూరిలో ఉన్నాయని తెలుసుకుని ఇక్కడకు వస్తాడు. ఆ కుటుంబంలో అనుభందాలు, ఆప్యాయతలు చూసి ఇక్కడే ఆ పల్లెలో ఉండిపోదాం అనుకునే కుర్రాడిగా రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’లో నటించాడు.
కథ ప్రకారం రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ లండన్ నేపధ్యంలో ఉంటుంది. సినిమాలో రామ్ చరణ్ రగ్బీ ప్లేయర్ గా పరిచయం అవుతారు. ఇంట్రడక్షన్ సీన్ తో పాటు ఫైట్, ఒక సాంగ్ కూడా చిత్రీకరించారు. సినిమా ప్రారంభంలో హీరో రామ్ చరణ్ ను అల్ట్రా మోడరన్ కుర్రాడిగా చూపించారు. ఈ సన్నివేశాలు చాలా అద్బుతంగా వచ్చాయని సమాచారం.
అటు యూత్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలతో సినిమా తెరకెక్కిందని మూవీ యూనిట్ సభ్యులు చెప్తున్నారు. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులలో క్షణ క్షణానికి అంచనాలు పెంచేస్తుంది.
