కొండాపూర్‌లో ‘గోయాజ్’ 22వ స్టోర్ ప్రారంభం

Untitled 18

భారతదేశంలో ప్రముఖ లగ్జరీ సిల్వర్ జువెలరీ బ్రాండ్ ‘గోయాజ్ (GOYAZ)’ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. ఇందులో భాగంగా నగరంలోని కొండాపూర్‌లో తమ 22వ స్టోర్‌ను జనవరి 31న ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన శ్రీమతి విజయలక్ష్మి, శ్రీమతి రమాదేవి, మరియు శ్రీమతి మాధవి గార్లు జ్యోతి ప్రజ్వలన చేసి నూతన స్టోర్‌ను ప్రారంభించారు.

సుమారు 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ షోరూమ్, అత్యాధునిక డిజైన్లతో కస్టమర్లకు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ అనుభూతిని అందించనుంది. లగ్జరీ మరియు వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ స్టోర్‌లో వైవిధ్యమైన, ఆకర్షణీయమైన వెండి ఆభరణాల కలెక్షన్‌ను అందుబాటులో ఉంచారు.

ప్రారంభోత్సవ ఆఫర్లు:

స్టోర్ ప్రారంభం సందర్భంగా గోయాజ్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కస్టమర్లు చేసే కొనుగోలు విలువ ఆధారంగా రూ. 3,000 నుంచి రూ. 30,000 వరకు ఉచిత గిఫ్ట్ వోచర్లను అందిస్తోంది. ఉదాహరణకు, రూ. 1,00,000 కొనుగోలుపై రూ. 30,000 వోచర్ లభిస్తుంది. ఈ ఆఫర్లు జనవరి 31 నుండి ఫిబ్రవరి 22 వరకు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే మరిన్ని కొత్త మార్కెట్లలోకి అడుగుపెట్టనున్నట్లు సంస్థ పేర్కొంది.

Exit mobile version