కేరళలో ఏర్పాట్లు అద్దరగొడుతున్న బన్నీ ఫ్యాన్స్

కేరళలో ఏర్పాట్లు అద్దరగొడుతున్న బన్నీ ఫ్యాన్స్

Published on Jan 9, 2020 11:00 PM IST

అల్లు అర్జున్ తెలుగులో ఎంత పాపులర్ హీరోనో మలయాళంలో కూడా అంతే పాపులర్. మరే తెలుగు హీరోకి లేనంత క్రేజ్ కేరళలో బన్నీకి ఉంది. అక్కడ ప్రేక్షకులు ఆయన్ను మల్లు అర్జున్ అని ప్రేమగా పిలుచుకుంటారు. ఇక ఈ నెల 12న విడుదలకానున్న ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని మలయాళంలో ‘అంగు వైకుంఠపురత్తు’ పేరుతో విడుదల చేస్తున్నారు.

సినిమా విడుదలకు తెలుగునాట ఎలాగైతే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయో కేరళలో కూడా అలాగే జరుగుతున్నాయి. మొదటిరోజు 30కి పైగా స్పెషల్ షోలను ఏర్పాటు చేయడంతో పాటు భారీ కటౌట్లు, బ్యానర్లు రెడీ చేస్తున్నారు అక్కడి లోకల్ ఫ్యాన్స్. మొత్తానికి ఇప్పటి వరకు కేరళలో ఏ తెలుగు హీరో సినిమాకి దొరకనంత గ్రాండ్ రిలీజ్ బన్నీ సినిమాకు లభిస్తోంది. పైగా మలయాళ నటులు జయరామ్, గోవింద్ పద్మసూర్యలు చిత్రంలో కీలక పాత్రల్లో నటించడంతో సినిమాపై అక్కడి ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

తాజా వార్తలు