యువ హీరో అరవింద్ కృష్ణ, మీనాక్షి దిక్షిత్ జంటగా నూతన దర్శకుడు అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అడవి కాచిన వెన్నెల’. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ‘అడవి కాచిన వెన్నెల’ ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఇటివల తెరకెక్కిన చిన్న సినిమాలలో ‘అడవి కాచిన వెన్నెల’ ది బెస్ట్ అని సినిమా చూసిన పలువురు ప్రముఖులు అంటున్నారు. సుమారు 28 నిముషాల పాటు గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కిన సన్నివేశాలు హైలైట్ అని సమాచారం.
ఈ సినిమా నైజాం, వైజాక్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడం, దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడంతో సినిమా బాగుంటుందనే అంచనాలు ఏర్పడ్డాయి. విశ్వనాధ రెడ్డి లోబడ్జెట్ లో చక్కని థ్రిల్లర్ తీశారు. కార్తీక్ రోడ్రిగేజ్ అందించిన నేపధ్య సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణ. అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందని ఇన్ సైడ్ టాక్.
