కలాంనీకు సలాం …

apj--abdul-kalaam
కాలం నీ విజ్ఞానంతో పాటూ పరిగెట్టలేక ఆగిపోయింది..
దేశం నీ ఆలోచనా వేగాన్ని అందుకోలేక అలసిపోయింది..
‘నిద్రపోతే వచ్చేది కల కాదు.. నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేది కల’ అన్న అపార అనుభవ శాస్త్రవేత్త కళ్ళు నేడు శాశ్వతంగా మూతబడ్డాయి..
కాలే కట్టేకు మాత్రమే చావు..
కానీ నవభారత నిర్మాణంలో దాదాపు 80ఏళ్ళకు పైగా శ్రమించిన ఆయన మేధస్సుకు మరణం లేదు.
అణు భారత్ తో ప్రతీ భారతీయుడినీ అణువణువునా చలింపచేసిన ఘనత ఆయనది.
రాష్ట్రపతి స్థానం తన స్థానంలో నిన్ను మోసి ఎంతలా పులకరించిపోయింది..
చిన్నారులంటే అమితమైన ప్రేమ.. యువతీ యువకులంటే అపారమైన గౌరవం..
రాజకీయాలలో మంత్రులతో గడటడం కంటే.. కాలీజీ విద్యార్థులకు సమయాన్ని కేటాయించడం ఆయనకేంతో ఇష్టమట..
ఎంతో మంది యువకులు తాము చదివిన తొలి ఆటోబయోగ్రఫీ కలాం రాసిన ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ అనడం అతిశయోక్తి కాదు..
సిపాయి యుద్ధంలో మరణించడం ఎంత గర్వమో.. నేడు కలాం ‘ఐఐఎమ్’లో లెక్చర్ చెప్తూ తుదిశ్వాస విడుడవడం అంతే గర్వకారణం..
“రామేశ్వరం.. షిల్లాంగ్” .. భారతదేశ చరిత్రని తిరగరాసి చరిత్ర సృష్టించిన మహత్తర మేధావి
“ఆది – తుది”
మేమిక్కడ మాది కలాం బ్రతికిన కాలమని భావితరాలకు సగర్వంగా చెప్పుకుంటాం..
అక్కడ మిసైళ్ళు, రాకెట్లు అంతరిక్షంలో నీకు స్వర్గానికి దారిచూపిస్తాయన్న ఆశతో.. శెలవు
RIP అబ్దుల్ కలాం..

Exit mobile version