అనుష్క అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ రెడీ చేసిన గుణశేఖర్..!

rudrama-devi-Anushka
అగ్ర హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘రుద్రమదేవి’. కాకతీయ వీరనారి రాణీ రుద్రమదేవి జీవితగాధ ఆధారంగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక సినిమా ఇది. గత ఏడాది అనుష్క బర్త్ డేకి మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర బృందం, ఈ ఏడాది మేకింగ్ వీడియోను విడుదల చేస్తున్నారు. ‘రుద్రమదేవి’ సినిమా కోసం అనుష్క గుర్రపు స్వారి, కత్తిసాముతో పాటు యాక్షన్ సన్నివేశాలలో శిక్షణ తీసుకుంది. మేకింగ్ వీడియోలో శిక్షణ దృశ్యాలను చూపించే అవకాశం ఉంది. హీరోలకు ఏమాత్రం తీసిపోని రోల్ లో అనుష్క కనిపిస్తారు.

గుణ టీం వర్క్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క జోడిగా చాళుక్య వీరబద్రుడి పాత్రలో దగ్గుబాటి రానా నటించగా, కథలో కీలకమైన గోన గన్నారెడ్డి పాత్రలో బందిపోటుగా అల్లు అర్జున్ నటించారు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇండియాలో తెరకెక్కుతున్న ఫస్ట్ హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి సినిమాగా ‘రుద్రమదేవి’ రికార్డు సొంతం చేసుకుంది.

Exit mobile version