‘గుంటూర్ టాకీస్’ ట్రైలర్ రిలీజ్ డేట్

firstlook-gunturtalkies
‘చందమామ కథలు’ సినిమాతో జాతీయ అవార్డు పొందిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు తాజాగా చేస్తోన్న మరో ప్రయత్నమే ‘గుంటూర్ టాకీస్’. సిద్ధు, శ్రద్ధా దాస్, సీనియర్ నరేష్, మహేష్ మంజ్రేకర్ తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా, గత కొద్ది రోజులుగా సినిమా యూనిట్ చేపడుతోన్న ఆసక్తికర ప్రచారకార్యక్రమాలు ఈ సినిమాపై మంచి అంచనాలు కలిగించాయి. చందమామ కథలుతో ఓ సరికొత్త వాస్తవిక కథను తెరకెక్కించిన ప్రవీణ్, ఈ సినిమా ద్వారా మరోసారి తన మార్క్‌ను బయటపెట్టనున్నారని తెలుస్తోంది.

ఇక ఇప్పటికే క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, పోస్టర్స్‌తో ఆసక్తి రేకెత్తించిన సినిమా యూనిట్, ట్రైలర్‌తో మెప్పించేందుకు త్వరలోనే మన ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 9న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. ఇక ఈ ట్రైలర్‌తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే ఆడియో, సినిమా రిలీజ్ డేట్‌లను ప్రకటించే విషయమై దర్శకుడు ప్రవీణ్ సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version