‘ఇరుముడి’లో బంగారు పల్లకి సాంగ్ పై మ్యూజిక్ డైరెక్టర్ క్లారిటీ!

Irumudi

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి తర్వాత తను చేస్తున్న సినిమానే “ఇరుముడి”. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ తోనే మంచి బజ్ ని అందుకుంది. ఇక ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాతే ఓ సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ చేస్తున్నట్లు కొన్ని రూమర్స్ వచ్చాయి.

అయ్యప్ప స్వామిపై సాగే బంగారు పల్లకి అనే సాంగ్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. అయితే ఈ సాంగ్ ఉంది అనే టాక్ పై సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ ప్రస్తుతం అయితే ప్లానింగ్ లేవని తెలిపారు. అయితే తనకి చాలా రిక్వెస్ట్ లు వచ్చాయని కానీ అంతిమంగా నిర్మాతలు టేక్ మీదే సాంగ్ ఉంటుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది అని అసలు విషయం రివీల్ చేసాడు. సో ఈ ఫేమస్ సాంగ్ పై కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు.

Exit mobile version