వరద బాధితుల కోసం భారీ విరాళం ప్రకటించిన త్రివిక్రమ్, ఎస్.రాధాకృష్ణ

trivikram chinnababu

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో వరద తాకిడికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా తమ వంతు బాధ్యతగా స్పందిస్తూ ఉంటారు దర్శకుడు త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు).

ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయక చర్యల కోసం తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.10 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ మేరకు సంయుక్తంగా ఒక ప్రకటన‌ చేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, సురక్షితం గా ఉండాలని అభిలషించారు

Exit mobile version