
నాని, లావణ్య త్రిపాఠీ జంటగా నటిస్తున్న ‘భలే భలే మగాడివోయ్’ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గ తెరకెక్కుతుంది. యువ సంచలనం మారుతి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా ఒక్క పాట మినహా షూటింగ్ ని పూర్తిచేసుకుంది.
ఈ పాట చిత్రీకరణ కోసం చిత్ర బృందం గోవా బయల్దేరింది. రెండు రోజులపాటూ ఈ పాట షూటింగ్ జరుగుతుందని అంచనా. నిర్మాణాంతర పనులు కూడా జరుగుతుండడం గమనార్హం. ఆగష్టు లో విడుదలకు సిద్ధమవుతుంది. గీతా ఆర్ట్స్, యు.వి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుంది. త్వరలో ఆడియో విడుదలకానుంది.

