
నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో హాట్ హీరోయిన్ హంసా నందిని నటిస్తుంది. కొన్ని రోజులు షూటింగులో కూడా పాల్గొంది. తన పాత్ర వివరాలు వెల్లడించలేనని, నేను గతంలో నటించిన పాత్రల కంటే భిన్నమైన పాత్ర అని హంసా తెలిపింది. దర్శకుడు కథ చెప్పిన వెంటనే అంగీకరించిందట.
లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ కధానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం స్వామిజీగా వినోదం పండిస్తారని సమాచారం. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా’ నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత. ‘హలో బ్రదర్’ తరహాలో వినోదాత్మక సినిమా అని సమాచారం.