గోల్డెన్ లెగ్ గా మారిన హంసా నందిని

Hamsa-Nandini-
కొంతమంది హీరోయిన్స్ కి మొదటి సినిమా బ్రేక్ ఇస్తే కొంతమందికి వారు చేసే గెస్ట్ రోల్స్ మంచి గుర్తింపుని బ్రేక్ ని ఇస్తాయి. ఇదే విషయం అందాల భామ హంసానందిని విషయంలో జరిగింది. హంసా నందిని ‘అనుమానాస్పదం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ తనకి బ్రేక్ ఇచ్చింది మాత్రం ‘ఈగ’ సినిమాలో తను చేసిన గెస్ట్ రోల్ మాత్రమే.. ఆ తర్వాత నుంచి వరుసగా స్పెషల్ సాంగ్స్ మరియు స్పెషల్ రోల్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. హంసా నందిని ‘లౌక్యం’ లో చేసిన స్పెషల్ రోల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘లౌక్యం లో నేను బ్రహ్మానందం భార్యగా చేసిన హంస సిప్పీ పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నా పాత్రని థియేటర్ లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఐరెన్ లెగ్ అన్నవారు ఈ సినిమాతో గోల్డెన్ లెగ్ అంటున్నారు. ఇలాంటి స్పెషల్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ చేయడం కూడా కష్టమే. రుద్రమదేవి లో మధానిక అనే ఫుల్ లెంగ్త్ రోల్ చేసాను. నటనా ప్రాధాన్యం ఉన్న ఈ పాత్ర నాకు మంచి పేరు తెస్తుంది. ఈ సినిమా కోసం నేర్చుకున్న కత్తి యుద్దాలు ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించాయని’ హంసానందిని తెలిపింది.

Exit mobile version