ఆచితూచి అడుగేయాలి అంటున్న హన్సిక

hansika
చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అందాల భామ హన్సిక హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి చాలా రోజులైనప్పటికీ మొదట్లో అంతంతమాత్రంగా ఉన్న తన కెరీర్ ఇప్పుడు చాలా స్పీడుగా ఉంది.

గత కొంతకాలంగా శింబు తో నడిపిన ప్రేమాయణం వల్ల, అలాగే హన్సిక బిహేవియర్ బాగుండటం లేదని కొంతమంది నిర్మాతలు కేసు పెట్టడం వల్ల బాగా వార్తల్లో నిలిచింది. కానీ ఈ విషయాలన్నిటినీ తను చాలా కూల్ గా డీల్ చేసేసింది.

ప్రస్తుతం తనపై వస్తున్న వార్తల గురించి ఆమె ముందు ఉంచితే.. ‘నేను జస్ట్ కెమెరా ముందుకు వచ్చి నటించి వెళ్లి పోవడానికి ఇండస్ట్రీకి రాలేదు. ఎలాంటి విషయాలనైనా తట్టుకొని నిలబడాలని వచ్చాను. మనకు తెలియకుండా మన చుట్టూ చాలా జరుగుతుంటాయి. అప్పుడే ఆచి తూచి అడుగేయాలని’ హన్సిక అంటోంది.

ప్రస్తుతం హన్సిక పలు తమిళ సినిమాలతో పాటు తెలుగులో రవితేజ సరసన ‘పవర్’ సినిమాలో నటిస్తోంది.

Exit mobile version