150 థియేటర్ల లో 50 రోజులు పూర్తి చేసుకున్న “హను మాన్”

hanuman

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం మరొక రికార్డ్ ను సాధించింది. 150 థియేటర్ల లో 50 రోజులు పూర్తి చేసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా అందరినీ అలరిస్తుంది.

ఈ చిత్రం త్వరలో డిజిటల్ ప్రీమియర్ గా ఆడియెన్స్ ముందుకి రానుంది. అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Exit mobile version