మెగాస్టార్ చిరంజీవి హీరోగా హీరోయిన్ త్రిష కలయికలో యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ వండర్ చిత్రం ‘విశ్వంభర’ కోసం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు అభిమానుల్లో మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా విడుదల ఇప్పుడు ప్రశ్నార్ధకంగా ఉంది.
అయితే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం హను మాన్ సంగీత దర్శకుడు గౌర హరి ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు స్టార్ట్ చేసినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాకి లెజెండరీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలానే తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ కోసం కూడా అందరికీ తెలుసు.
అలాంటిది తన వర్క్ ని గౌర హరి రీప్లేస్ చేస్తున్నాడు అనే టాక్ ఒకింత ఆశ్చర్యకరమే అని చెప్పొచ్చు. అలాగని గౌర హరి కూడా మామూలు వర్క్ అందించడం లేదు. తన పనితనం ఏంటో హను మాన్, మిరాయ్ వంటి సినిమాలకి చూసాం. సో విశ్వంభర లాంటి సినిమా చేసినా మంచి ఇంపాక్ట్ కలిగించగలడు. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
