చిరు “విశ్వంభర” నుంచి చరణ్ “రంగస్థలం” నుంచి పవన్..

తెలుగు సినిమా దగ్గర భారీ ఎత్తున స్టార్డం ఉన్న హీరోస్ లో మెగా ఫ్యామిలీ నుంచే చాలా మంది ఉన్నారు. మరో వారిలో మొదటిగా ‘పునాది రాళ్లు’ వేసిన మెగాస్టార్ చిరంజీవి తరువాత తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే నెక్స్ట్ వారి వారసుడు ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లు అని చెప్పాలి.

అయితే వారు ఎంతో ఆరాధించే దైవం ఎవరు అంటే తెలుగు సినిమా ప్రేక్షకులు అందరికీ బాగా తెలుసు అది ఆ అంజనీపుత్రుడు హనుమంతుడు అని అయితే ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లు తమదైన శైలిలో తమ ఆరాధ్య దైవ శుభాకాంక్షలు అందరికీ తెలిసిందే.

చిరు తాను ప్రస్తుతం చేస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” సెట్స్ నుంచి తాము సినిమా కోసం రూపొందించిన హనుమంతుని విగ్రహం బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపగా రామ్ చరణ్ తన ఇండస్ట్రీ హిట్ చిత్రం “రంగస్థలం” లో హనుమంతునితో కలిపి ఉన్న తన పోస్టర్ తో తెలిపాడు.

దీనితో వీరి శుభాకాంక్షలు ప్రత్యేకంగా మారగా మరో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇదే ప్రత్యేక దినాన తన పొలిటికల్ నామినేషన్ కూడా వేయడం విశేషం. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి ముగ్గురు హీరోలకి ఈ హనుమాన్ జయంతి మరింత ప్రత్యేకంగా మారడం వారు తమదైన పనులతో అభిమానుల్లో మరింత నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.

Exit mobile version