పెద్ది : ఆ రిఫరెన్స్ సీక్వెన్స్‌కు అభిమానులకు గూస్‌బంప్స్ ఖాయం..!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే చిత్ర డిఓపి రత్నవేలు తాజాగా ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలోని ఓ సీక్వెన్స్ గురించి ఆయన చెప్పిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

పెద్ది సినిమాలో హనుమంతుడి రిఫరెన్స్‌తో వచ్చే ఒక ప్రత్యేకమైన సీక్వెన్స్ ఉందని రత్నవేలు తెలిపారు. ప్రత్యేకంగా ఈ సీన్ థియేటర్లలో ప్రేక్షకులకు, అభిమానులకు ఖచ్చితంగా గూస్‌బంప్స్ తెప్పిస్తుందని ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చెప్పారు. దీంతో అసలు ఆ సీన్ ఎప్పుడు వస్తుందా.. ఆ సీన్‌లో చరణ్ ఎలా కనిపిస్తాడా అనే ఆసక్తి అభిమానుల్లో క్రియేట్ అయ్యింది.

దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సీన్‌ను ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారని, రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ ఎపిసోడ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిందని టాక్. జూన్ 4న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో ఈ ఊరమాస్ హనుమాన్ సీక్వెన్స్ ఎలా ఉండబోతుందోనని మెగా ఫ్యాన్స్ ఇప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు.

Exit mobile version