టాలీవుడ్ యంగ్ హంక్, ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రానా తన కెరీర్లో లో మర్చిల్పోలేని సినిమాలు చేస్తున్నాడు. గత సంవత్సరం రోజులుగా రానా టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మక సినిమాలైన ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఇది కాకుండా బాలీవుడ్ లో రానున్న ‘బేబీ’ సినిమాకి కూడా షూటింగ్ ని ఫినిష్ చేసాడు. ఈ రోజు రానా దగ్గుబాటి తన 30వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు.
‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ కి బ్రదర్ గా ‘భళ్లాల దేవ’ గా కనిపించనున్నాడు. రానా ఇప్పటికే ఈ సంవత్సరం ఉన్న బాహుబలి షెడ్యూల్ ని ఫినిష్ చేసారు. ప్రస్తుతం రానా ‘బేబీ’, ‘రుద్రమదేవి’ సినిమాల కోసం ఎదురు చూస్తున్నాడు. నిన్నే రానా రుద్రమదేవిలో పోషించిన చాళుక్య వీరభద్రుడి లుక్ ని రిలీజ్ చేసారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది కాకుండా బేబీ ట్రైలర్ యుట్యూబ్ లో రికార్డ్స్ సృష్టిస్తోంది. బేబీ సినిమా జనవరిలో రిలీజ్ కానుంటే బాహుబలి 2015 సమ్మర్ లో రిలీజ్ కానుంది.
