యువ హీరో సుమంత్ అశ్విన్ , మెగా డాటర్ నిహారిక జంటగా నూతన దర్శకుడు లక్ష్మణ్ కార్య తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. ఈనెల 28న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం నెగిటివ్ రివ్యూస్ ను తెచ్చుకోవడంతో ఓపెనింగ్స్ కూడా రాబట్టుకోలేకపోయింది. దాంతో ఈచిత్రానికి భారీ నష్టాలు తప్పవనుకున్నారు. కానీ ఈ చిత్రం శాటిలైట్ రూపంలో గట్టెక్కింది.
ఈచిత్రం యొక్క శాటిలైట్ హక్కులు రూ . 3కోట్లకు అమ్ముడయ్యాయి. దాంతో ఈచిత్రానికి పెట్టిన పెట్టుబడి దాదాపుగా తిరిగొచ్చింది. ఈ లెక్కన ఈచిత్రం నష్టాలనుండి బయటపడినట్లే. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ సమర్పణలో పాకెట్ సినిమాస్ నిర్మించిన ఈచిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించారు.
