హ్యాపీ వెడ్డింగ్ షూటింగ్ పూర్తి !

niharika

సుమంత్ అశ్విన్ హీరోగా నీహారికా హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా హ్యాపీ వెడ్డింగ్. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ఈ విషయాని నీహారిక తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో తెలిపింది.

పల్లెటూరు ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అవుట్ పుట్ బాగా వచ్చిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. లక్ష్మణ్ కర్య ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. రచయిత భవాని ప్రసాద్ ఈ సినిమాకు సంభాషణలు రాస్తున్నాడు. ఫీల్ గుడ్ స్టోరి తో రానున్న ఈ సినిమాతో సుమంత్ అశ్విన్, నీహరిగా విజయం సాధించాలని కోరుకుందాం.

Exit mobile version